మోహన్‌బాబు నటుడు, నిర్మాత, విద్యావేత్త. కొత్తగా కలెక్షన్ కింగ్ స్ర్కీన్‌ప్లే రైటర్ అవతారం ఎత్తారు. చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించిన సినిమా ‘గాయత్రి’. ఎక్కడో హిట్ అయిన సినిమా రైట్స్ కొని మన తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌కి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ‘గాయత్రి’కి మూలం ఏది? మాతృక ఏ సినిమా? వంటి ప్రశ్నలకు మంచు కాంపౌండ్ నుంచి సమాధానాలు రావడం లేదు. బట్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. ‘గాయత్రి’కి మోహన్‌బాబు స్ర్కీన్‌ప్లే రాశారు. శుక్రవారం ప్రేక్షకులు థియేటర్లో చూడబోయేదంతా కలెక్షన్ కింగ్ స్ర్కీన్ప్లేయే. ఇప్పటివరకు ఏ సినిమాకు కష్టపడినంత మోహన్‌బాబు ఈ సినిమాకి కష్టపడ్డారని ఆయన తనయుడు మంచు విష్ణు తెలిపారు. ఈ వారం బాక్సాఫీస్ బరిలో మరో రెండు సినిమాలు ఉండడంతో మంచి ఫ్యామిలీ పబ్లిసిటీపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది. పద్దతి ప్రకారం సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.