యానాం పుదుచ్చేరిలో భాగమైనప్పటికీ ఏపీని ఆనుకొని ఉంటుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచి, పుదుచ్చేరి మంత్రిగా ఉన్నారు. 1996 నుంచి ఇప్పటిదాకా ఆయనపై పోటీ చేసి డిపాజిట్ సాధించిన అభ్యర్థులు లేరు. ఈయన నిన్న మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ని కలిసారు. ఏపీ మత్స్యకారుల సంఘాలు నేత మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో వారి సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకు వెళ్లారు.
అయితే జనానికి గుర్తుందో లేదో కానీ కొద్ది నెలల క్రితమే ఈయన పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లకి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లో ఈయన పవన్ కి అవగాహన లేదంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాపు ల కి 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ తీర్మానం చేసిన సందర్భం లో, బీసీ కమీషన్ రిపోర్టు రాకుండానే తీర్మానం చేశారని, ఇలా చేయడం సరైంది కాదని, కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యానాం మంత్రి మల్లాడి కృష్ణారావు, కాపులను బీసీల్లో చేర్చడంపై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు.
ఇలా పవన్ ని దుయ్యబట్టిన కొద్ది నెలలకే ఈయన పవన్ దృష్టి మత్స్యకారుల సమస్య పేరిట పవన్ ని కలవడం విశ్లేషకులకి ఆసక్తి కలిగించింది. మల్లాడి కాంగ్రెస్ నేత అని, ఆయనకు ప్రజా సమస్యలపై నిబద్దత ఉంద ని ప్రశంసించాడు పవన్. మత్స్య కారుల సమస్యలు తనకు తెలుసని, జనసేన వారికి అండగా ఉంటుందని, మత్య్సకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ న్యాయమైనదని, ఉత్తారాదిలోని కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీ లుగా మత్స్యకారులు గుర్తించబడుతున్నారని పవన్ తెలిపారు. మొత్తానికి మల్లాడి, పవన్ ల భేటి ఆసక్తి కలిగించింది.