గుబురు గడ్డంతో కాకుండా, క్లీన్ షేవ్్లో రామ్చరణ్ను చూసి ఎన్ని రోజులైందో కదూ! జస్ట్ ఐదారు రోజులు ఆగితే గుబురు గడ్డం తీసేయొచ్చు. సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ కోసం రామ్చరణ్ గడ్డం పెంచి ఈ లుక్ మైంటైన్ చేస్తున్నారు. శుక్రవారంతో సుక్కు సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. అప్పుడు చరణ్ ఇంచక్కా గడ్డం తీసేయొచ్చు. ఈ సినిమాలో ‘దువ్వాడ జగన్నాథమ్’ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ‘జిల్ జిల్ జిగేల్…’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారు. సోమవారం మొదలైన ఈ సాంగ్ షూటింగ్ శుక్రవారంతో పూర్తవుతుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని ‘రంగస్థలం’ యూనిట్ చెబుతోంది. తీసిన సన్నివేశాన్ని మళ్ళీ తీస్తూ సినిమాను చెక్కుతున్న సుకుమార్ చెక్కుడు చివరికి వచ్చిందన్నమాట.