వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ‘అల్లరి’ నరేష్‌తో సినిమా తీయడానికి దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ముందడుగు వేశాడు. ఈ సినిమాలో హీరో రేంజ్ క్యారెక్టర్‌కు సునీల్ ను తీసుకున్నాడు. ఇటీవల సునీల్ చేసిన సినిమాల సంగతి ఏమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటికి తోడు ఏరికోరి ఫ్లాప్ సినిమా హీరోయిన్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురి హీరోయిన్లకు చోటుంది. ముగ్గురిలో ఇద్దరుగా ‘సీమ టపాకాయ్’, ‘అవును’ సినిమాల ఫేమ్ పూర్ణ, ‘రంగులరాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లలను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో హీరోయిన్గా నందినీ రాయ్‌ను సెలెక్ట్ చేశారు. ఈ హైదరాబాదీ అమ్మాయి గతంలో సుధీర్ బాబు ఫ్లాప్ సినిమాల్లో ఒకటైన ‘మోసగాళ్లకు మోసగాడు’ చేసింది. నరేష్, సునీల్ ట్రాక్ రికార్డులు చూసి హిట్ ట్రాక్ ఉన్న హీరోయిన్లు ఈ సినిమా చేయడానికి ‘నో’ అంటున్నారో లేదా క్యారెక్టర్లకు పర్ఫెక్ట్ యాప్ట్ అని వీళ్ళను సెలెక్ట్ చేశారో? మొత్తానికి ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్లను ఫైనలైజ్ చేశారు భీమనేని.