ఇలియానా, శ్రుతిహాసన్, శ్రియలకు
లారీల కొద్దీ ద్వేషంతో…
ఎంత ప్రేమించామండీ మిమ్మల్ని! మీ కోసం థియేటర్ల దగ్గర క్యూలు కట్టాం.. మీ కోసం ఫ్లాప్ సినిమానీ ఒకటికి పది సార్లు చూశాం. మీ పోస్టర్లను కట్ చేసి… బ్యాచ్‌లర్ కొంపల్ని పావనం చేసుకున్నాం. మీ కవర్ పేజీ కనిపిస్తే… స్వాతి నుంచి సితార వరకూ…. మ్యాగ్జిమం అన్ని మ్యాగజైన్లనీ కొనేశాం. అక్షరం ముక్క రాకపోయినా… మీ బొమ్మల్ని చూస్తూ.. మబ్బుల వరకూ వెళ్లి ఆపై ఓపిక లేక, ముందుకు వెళ్లే దారి తెలీక వెనక్కి వచ్చేశాం.
దేవసదాసులో ఇలియానా నడుం చూసి.. వారం రోజులు లేవలేదు
అది నడుమా… నయాగరమా.. అనేది తేల్చుకోవడానికి నాలుగేళ్లు పట్టింది
పోకిరిలో బుంగబూతి వేసుకొని మహేష్‌ని అమాయకంగా ప్రేమిచేస్తున్నప్పుడు అదృష్టం పండుగాడికే ఎందుకు దక్కిందబ్బా అని కిలోల్లెక్కన కుళ్లిపోయాం
ఖతర్నాక్‌లో వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్‌కి తక్కువ టైపు పాత్రలు చేసినా మన ఇలియానానే కాదా… అని సర్దుకుపోయి అప్పుడు కూడా అహర్నిశలూ ప్రేమించే పనిలోనే పడ్డాం.
కానీ ఏం చేశావ్… తెల్లతోలు ఉంది కదా అని ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్‌తో లవ్‌లో పడిపోయావ్..
మీ ఇద్దరికీ పెళ్లయిపోయిందని కొందరు.. అహ కాదు.. సహజీవనం అది ఇంకొందరు..
చికెన్‌ని స్టవ్ మీద పెడితే ఏంటి?? ఓవెన్‌లో కాల్చితే ఏంటి??
మా మనసులు మాడిపోయాయ్.. ఇక్కడ.
శ్రుతిని ఏమైనా తక్కువ ప్రేమించామా??
కిలో కండ లేకపోయినా… గుండెల్లో చోటిచ్చాం.
హిట్లు పడకపోయినా.. ఇంటా బయటా కటౌట్లు కట్టుకున్నాం.
ఆర్థిక స్థోమత సరిపోక గుళ్లూ గోపురాల వరకూ వెళ్లలేదు గానీ… ఏం తక్కువ చేశామని…?
యాక్టింగా అంతంత మాత్రమే..
డాన్సులా… వచ్చీ రానట్టుంటాయి.
కానీ ప్రేమించడంలో లోటు చేశామా..
నువ్వు మాత్రం యూకే బోయ్ ఫ్రెండ్‌తో డ్యూయెట్లు పాడుకుంటున్నావ్.
రేపో మాపో పెళ్లంటే… విరహ గీతాలు పాడుకుంటూ, నీ పాత సినిమాల్ని చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేం.
పోనీలే.. మనకు శ్రియ ఉందనుకుంటే.. తను కూడా నెత్తిమీద శటగోపం పెట్టేసి వెళ్లేపోయేట్టే కనిపిస్తోంది.
రష్యన్ వోడితో.. ప్రేమలో పడిందన్న వార్త విన్న తరవాత బావర్చీ బిరియానీ తింటున్నా సహించడం లేదు. నీ మనసు గెలుచుకున్న రష్యన్ కుర్రాడ్ని కసితీరా తిట్టుకుందామనుకున్నా.. నోరు తిరగడం లేదు. ఏం చేస్తాం…?? మనసులో మండిపోవడం తప్ప.. మా బాధ్యని వ్యక్తపరచుకోలేమాయె.
మీకు సినిమాలు చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి తెలుగు, తమిళం కావాలా…?
ప్రేమించుకోవడానికి మాత్రం పరాయి దేశం పోతారా? మరి మేమంతా ఏమైపోవాలా…?
ఇదెక్కడి అన్యాయం అధ్యక్ష్యా…??
ఇక్కడి హీరోయిన్లు ఇక్కడి వాళ్లనే పెళ్లి చేసుకోవాలన్న రూలు తెస్తే బావుణ్ణు. ఎలాగూ 2019 ఎన్నికలు వచ్చేస్తున్నాయ్
కదా. ఇలాంటి హామీలు ఇచ్చేవాళ్లకి ఓట్లన్నీ గుద్ది పడేస్తాం.
ఎనీవే.. మీ ముగ్గురూ పెళ్లిళ్లు చేసుకొని హాయిగా కాపురాలు చేసుకోవాలని కనిపించినా గోపురాలకు దండాలు పెట్టుకుంటాం.. ఎంతైనా మీ మాజీ లవర్స్ కమ్ అభిమానులం కదా?
ఇట్లు
మీ
అరివీర భయంకరమైన మాజీ ప్రేమికుల సంఘం