మెగా హీరో సాయిధరమ్ తేజ్కీ – రెజీనాకీ మధ్య ఏదో సమ్ థింగ్ సమ్ థింగ్ నడిచిందన్నది మీడియా జనాల ఊహాగానం. ఇద్దరూ మూడు సినిమాల్లో నటించారు. తెరపైనే కాదు, బయటా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. ఈ పుకార్లపై ఇద్దరూ చాలా సార్లు స్పందించారు. ‘మాది స్నేహం మాత్రమే’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమధ్య రెజీనా ఓ కామెంట్ చేసింది. ప్రేమలో పడి మోసపోయానని, అది తన కెరీర్‌పై కూడా ప్రభావం చూపించిందని స్టేట్మెంట్ ఇచ్చింది. రెజీనాని ఎవరు మోసం చేశారన్న టాపిక్ కాస్త గరమ్ గరమ్‌గా నడిచింది. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? రెజీనా స్నేహితుడిగా మీరెలా స్పందిస్తారు? అని సాయిధరమ్ తేజ్‌ని అడిగితే…
”రెజీనాది వ్యక్తిగత విషయం. దానిపై నేనెలా కామెంట్ చేయగలను..? అది తప్పు కూడా” అంటూ సున్నితంగా ఈ సమాధానం చెప్పి జారుకున్నాడు మెగా హీరో. అయితే.. కొంతకాలం క్రితం నుంచీ రెజీనా – సాయిల మధ్య ఫ్రెండ్ షిప్ కూడా దెబ్బతిన్నదని, ఇప్పుడు ఇద్దరూ అంటీముట్టనట్టుగానే ఉన్నారని తెలుస్తోంది.