రోమ్ వెళ్తే రోమన్‌లా ఉండాలని ఒక ఇంగ్లీష్ సామెత. సమంత దీన్ని బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. బీచ్‌లో బికినీలో సేద తీరుతున్నారు. పెళ్లయిన అమ్మాయిలు ఎప్పుడూ పద్ధతిగా పట్టుచీర కట్టుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదుగా. ఇటీవల ‘రంగస్థలం’ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత, తర్వాత కొన్ని రోజులు తమిళ సినిమా షూటింగ్ చేశారు. ఆ షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే హాలిడేకి వెళ్లారు. “కావాలని షూటింగులకు సెలవు తీసుకోలేదు. తప్పక అవసరమై తీసుకున్నాను. విపరీతంగా అలసిపోయా” అని సమంత పేర్కొన్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. పెళ్లయిన తర్వాత సమంతలో ఏమార్పూ రాలేదు. పెళ్ళికి ముందు అభిమానులను అలరించినట్టే పెళ్ళి తర్వాత కూడా అలరిస్తున్నారు.