2005లో ఓ తమిళ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన రెజీనా తెలుగులో సుధీర్ హీరోగా నటించిన ఎస్ఎంఎస్ ద్వారా హీరోయిన్గా పరియమైంది. వచ్చిన కొద్దికాలంలోనే హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. అల్లు శిరీష్, సందీప్ కిషన్, రవితేజ వంటి హీరోలతో నటించిన రెజీనాకి సాయిధరమ్‌తేజ్‌తో చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మంచి పేరుని తెచ్చింది. ఆ సినిమా తర్వాత వెంటనే సాయిధరమ్తేజ్తోనే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం చేసింది. ఈ సినిమా కూడా హిట్ అయి ఇద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అయితే తేజు రికమండేషన్ వల్లే సుబ్రమణ్యం ఫర్ సేల్‌లో రెజీనాకు అవకాశం వచ్చిందని, వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వుందనే రూమర్లు వచ్చాయి. ఒక దశలో సాయిధరమ్‌తేజ్, రెజీనా పెళ్ళి చేసుకోబోతున్నారని కూడా అందరూ చెప్పుకున్నారు. అయితే అది నిజం కాదని, వారిద్దరి మధ్య అలాంటి అండర్స్టాండింగ్ లేదని తేజు సన్నిహితులు చెప్పారు. ఈ విషయంలో తేజుగానీ, రెజీనాగానీ ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. దీంతో వచ్చిన రూమర్ నిజమేనని అంతా అనుకున్నారు.
రెజీనాకు ఆల్రెడీ ఒక బాయ్‌ఫ్రెండ్ వున్నాడని, అతనితో ఎంతో కాలం నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతోందని తాజాగా అందిన సమాచారం. అతని పేరు విక్రమ్ మీనన్. ఈమధ్య తెలుగు, తమిళ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా వున్న రెజీనాకి కొద్దిరోజులు విరామం దొరికిందట. దీంతో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ వేసి వచ్చింది. దీన్ని బట్టి తేజు, రెజీనాల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వచ్చిన వార్తల్లో నిజం లేదని అర్థమవుతోంది.