తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘మెహబూబా’. శుక్రవారం ఉదయం టీజర్ విడుదల చేశారు. రీసెంట్గా రొట్ట కొట్టుడు క్యారెక్టరైజేషన్లతో పూరీ తీసిన సినిమాల కంటే టీజర్ బాగుంది. ఈయన గత సినిమాలతో పోలిస్తే… చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మేకింగ్, టేకింగ్లో కొత్తదనం కనిపించింది. కానీ, అర్బన్ ఆడియన్స్కి ఒక్కటే డౌట్ తెగ కొట్టేస్తుంది. షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా జంటగా మణిరత్నం తీసిన ‘దిల్సే’కి, ‘మెహబూబా’కి లింక్ ఏమైనా ఉందా? అని ఆలోచిస్తున్నారు. ఇండో-పాక్ బోర్డర్ లవ్ స్టోరీ అనగానే ‘దిల్సే’ అనేంతగా అర్బన్ ఆడియన్స్ దృష్టిలో మణిరత్నం ముద్ర వేశాడు. ‘మెహబూబా’ టీజర్లో ఆ సినిమా ఛాయలు కనిపించడంతో కథా పరంగా ‘మెహబూబా’ మరో ‘దిల్సే’ కాదుగా అని డిస్కస్ చేసుకుంటున్నారు.
ఒకవేళ సేమ్ స్టోరీతో సినిమా తీసినా పర్లేదనేది పూరీ అభిమానుల వాదన. ఎన్టీఆర్ ‘టెంపర్’, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా కథల్లో కీ పాయింట్ ఒక్కటే. అవినీతిపరుడైన పోలీస్ నిజాయితీగా ఎలా మారాడు? ఒక అమ్మాయి రేప్ అతణ్ణి ఎలా మార్చింది? అనేది పాయింట్. దర్శకుడు అనిల్ రావిపూడి ట్రీట్మెంట్, పూరీ ట్రీట్మెంట్ ఎంత వేర్వేరుగా ఉన్నాయో ప్రేక్షకులు చూశారు. మణిరత్నం కథను కాపీ చేసినా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో పూరీ సినిమా తీస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ‘దిల్సే’ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్ గురువు రాంగోపాల్ వర్మ ఒకరు. మణిరత్నం తీసినట్టు కాకుండా సినిమాను ఇలా తీస్తే ఎలా ఉంటుంది? అని పూరీకి ఐడియా ఇచ్చారేమో? అప్పుడప్పుడూ శిస్యుడికి ఐడియాలు ఇవ్వడం ఆయనకు అలవాటే. మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ స్టోరీ ఐడియా వర్మదే.