మధుబాబు.. తెలుగు పాఠకులకు పరిచయ వాఖ్యలు అవసరం లేని పేరు. షాడో మధుబాబుగా పాపులర్. ఆయన రాసిన షాడో డిటెక్టివ్ నవలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడున్న చాలా మంది దర్శక రచయితలకు మధుబాబు అంటే ఆరాధన. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. షాడో నవల చదివి ఎవరీ మధుబాబు? అంటూ పుస్తకం పై వున్న ఆయన అడ్రస్ ను వెతుకుంటూ హనుమాన్ జంక్షన్ లో పడిగాపులు కాసిన అభిమాని త్రివిక్రమ్. అయితే ఇంత పాపులారిటీ వున్నప్పటికీ ఏనాడూ ఆయన పబ్లిక్ లో కనిపించింది లేదు.
అలాంటి మధుబాబు తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. తన జీవితం, రచనలకు సంబధించిన చాలా విషయాలు గురించి పంచుకున్నారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. పనిలో పనిగా త్రివిక్రమ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రానున్న సినిమా.. మధుబాబు నవల ఆధారంగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మధుబాబు స్పదించారు. ” ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో తెలియదండీ?!. అవాస్తవం. మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. త్రివిక్రమ్ నాకు తెసులు ఎప్పటినుంచో. ఆయనకు కధ చెప్పి ఒప్పించడం అంత తేలిక కాదు. పైగా ఎన్టీఆర్ సినిమా అంటున్నారు. అలాంటి హీరోకి కధ అంటే మాటలు కాదు. చాలా కసరత్తులు చేయాలి. ఎదో నవల అంటే సరిపోదు కదా. త్రివిక్రమ్ గురించి నాకు బాగాతెలుసు. ఆయనకు ఆయన కధ తప్పితే ఇంకేది పట్టుదు( నవ్వుతూ). మాకు మంచి పరిచయం వుంది. ఒకసారి నన్ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. కుదిరినప్పుడు మాట్లాడుతుంటాం. అంతే తప్పితే ఇంకేమీలేదు” అని చాలా మృదువుగా ఈ అంశాన్ని కొట్టేపారేశారు మధుబాబు.
మొత్తంమ్మీద స్వయంగా మధుబాబే స్పదించడంతో ఈ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే.