మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, రజనీకాంత్ ‘కాలా’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలు ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మూడు ముక్కలాటలో ఏ ముక్క వెనక్కి వెళ్తుందో? ఏ ముక్క ముందుకు వస్తుందో? అనే డిస్కషన్ ఇండస్ట్రీలో జరుగుతోంది. మా సినిమా వెనక్కి వెళ్ళదు. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని ‘భరత్ అనే నేను’ సినిమా టీమ్ ఫీలర్లు బయటకు వదిలింది.
ప్రెజెంట్ ‘భరత్ అనే నేను’ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పూణేలో మరో షెడ్యూల్ చేస్తారు. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే మళ్లీ హైదరాబాదులో చేస్తారు. షూటింగ్ వర్క్ మొత్తాన్ని మర్చి 27కి కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొడతారు. ఏప్రిల్ 27న సినిమా రిలీజ్. రిలీజ్ డేట్‌కి, షూటింగ్ కంప్లీట్ డేట్‌కి మధ్య ఒక నెల గ్యాప్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ప్రాబ్లమ్ ఉండదు. ‘భరత్ అనే నేను’ టీమ్ ప్లానింగ్ ఇది. షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే పబ్లిసిటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు .