గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సాహసం ఎవరూ పెద్దగా చేయడం లేదు. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు. కుదిరితే అప్పుడప్పుడూ కేసీఆర్ భజన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ‘బందూక్’ దర్శకుడు లక్ష్మణ్ మురారి ముందుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ‘బందూక్’ సినిమా తీసిన లక్ష్మణ్ మురారి, తర్వాత కేసీఆర్ జీవితం ఆధారంగా ‘గులాల్’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అదేమైందో ఎవరికీ తెలీదు. కొత్తగా కేసీఆర్ భజన పాటతో వస్తున్నట్టు ప్రకటించారు. ఈ 17న కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని త్వరలో ‘వీరాధి వీరుడు అతడు’ పాటను విడుదల చేయనున్నట్టు లక్ష్మణ్ మురారి తెలిపారు. ప్రజా కవి గోరేటి వెంకన్న ఈ పాటను రాశారు. తెలుగులోని 18మంది ప్రముఖ గాయని గాయకులు ఈ పాటను పాడారట!