ఏప్రిల్ 27న ముక్కోణపు పోటీ తప్పదనుకుంటే… నాపేరు సూర్య ఓ రోజు ముందే వచ్చేయడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 27నే నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా, భరత్ అను నేను, కాలా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మూడు సినిమాలూ ఒకే రోజు ఎలా వస్తాయన్న సందిగ్థం టాలీవుడ్లో నెలకొంది. నిర్మాతలు కూర్చుని మాట్లాడుకున్నా పలితం లేకుండా పోయింది. నిజంగా ఆ రోజు ఎన్ని సినిమాలొస్తాయన్న విషయంలో ఇంకా క్లారిటీ రాకుండానే బన్నీ ఓ అడుగు ముందుకు వేశాడు. నా పేరు సూర్య ఇప్పుడు ఏప్రిల్ 27 న కాదు… ఒక రోజు ముందుగా అంటే 26నే వచ్చేస్తోంది. మిగిలిన సినిమాల విడుదల తేదీ మారిందో, లేదో ఇంకా తెలియాల్సివుంది.
ఓరోజు ముందుకు రావడం బన్నీకే మంచిది. ఎందుకంటే ముందుగా థియేటర్లలో కర్చీఫ్లు వేసుకోవొచ్చు. సినిమా బాగుంటే 27న మార్చడం ఎలాగూ కుదరదు. కాబట్టి వీలైనన్ని థియేటర్లు చేతులో ఉంచుకోవొచ్చన్నది బన్నీ నిర్మాతల ఆలోచన. మరి… భరత్ అను నేను, కాలా నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.