ఈమధ్య మన తెలుగు సినిమాలకు హిందీ శాటిలైట్ రూపంలో భారీగా సొమ్ములు ముడుతున్నాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాలకు హిందీలో భారీ ఎత్తున డబ్బింగ్ శాటిలైట్ రేట్లు ముడుతున్నాయి. కుర్ర హీరోలకూ ఇప్పుడు గిరాకీ ఏర్పడింది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హిందీలో ఊహించని రేటు పలికింది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏకంగా రూ.8 కోట్లకు కొనుగోలు చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన సినిమా ఇది. సాక్ష్యం చిత్రానికి ఈ స్థాయిలో రేటు రావడానికి పూజా ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్లో పూజా హెగ్డే ఫేమస్. హృతిక్ రోషన్తో కలసి నటించింది. తాజాగా బన్నీతో చేసిన దువ్వాడ జగన్నాథమ్ హిందీ ఛానళ్లలో తెగ ఆడేస్తోంది.యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇవన్నీ పరిగణలోనికి తీసుకొనే.. సాక్ష్యం చిత్రాన్ని ఇంత మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్టు టాక్.