వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ, షరా మామూలుగా తనదైన స్టైల్లో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు జనసేన పరిస్థితి మరో ప్రజా రాజ్యం లాగా మారుతోందని పవన్ కళ్యాణ్ మరో చిరంజీవిలాగా మారుతున్నాడని విమర్శనాస్త్రాలు సంధించాడు.
పవన్ కళ్యాణ్ సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఉండవల్లి, జయప్రకాశ్ , ఎమ్మెల్సీ నాగేశ్వర్, చలసాని లాంటి వాళ్ళందరితో భేటీ ఏర్పాటు చేసి తన వంతు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జయప్రకాశ్ నారాయణను కలుపుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని, అలా తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా రాజ్యం కంటే ఘోరంగా తయారవుతుందని రాంగోపాల్ వర్మ విమర్శించాడు. అలాగే నోవాటెల్ హోటెల్ లో పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు సింహం లాగా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్ని వర్గాలను సంతృప్తిపరచడం కోసం శాంతియుత మార్గంలో వెళుతున్నాడని ఇలా చేసినా కూడా జనసేన పార్టీ మళ్లీ ప్రజారాజ్యం లాగా తయారవుతుంది వర్మ ఎద్దేవా చేశాడు.
అయితే పవన్ కళ్యాణ్ గతంలోనే రాంగోపాల్ వర్మ విమర్శల కు తాను ప్రతిస్పందించనని ప్రకటించిన కారణంగా ఇప్పుడు రాంగోపాల్ వర్మ చేసిన ఈ విమర్శలకు జనసేన పార్టీ నుంచి కానీ, పవన్ కళ్యాణ్ నుంచి కానీ ప్రతి స్పందన వచ్చే అవకాశం లేనట్టే.