కనుచూపు మేరల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ బయట నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్నాడని పూరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడుతున్నాడని అనుకోవద్దు. అతడితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు రెడీ. కాకపోతే అందరి కంటే ముందు చార్మీ కర్చీఫ్ వేస్తుంది. పూరి జగన్నాథ్ సినిమా తీస్తానని లేదా కథ సిద్ధంగా ఉందని చెప్పడం ఆలస్యం ‘నేను ప్రొడ్యూస్ చేస్తా’ అంటోంది. కనీసం మాటవరసకు… ఎవరు ఏమనుకుంటారోననే మొహమాటానికి కూడా నేను ప్రొడ్యూస్ చేయనని చార్మీ అనడం లేదు. నిన్నటికి నిన్న శనివారం నాడు పోలీసుల విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ట్విట్టర్లో ఒక ఫొటో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ “నిజంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినట్టు ఫీలవుతున్నా. దర్శకులు అందరికీ నన్ను కన్సిడర్ చేయమని సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా” అన్నారు. మీ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఉంటే ఇవ్వమని అడిగారు. వర్మ ప్రియ శిష్యుడు పూరి “స్క్రిప్ట్ రెడీగా ఉంది. మీ డేట్స్ కోసం వెయిటింగ్” అన్నాడు. పూరి స్టేట్మెంట్ రావడం ఆలస్యం “నేనే ప్రొడ్యూసర్” అని చార్మీ రెడీ అయ్యింది.
చార్మీ కోసమే దర్శకుడు పూరి జగన్నాథ్ కాస్టింగ్ ఏజెన్సీతో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే ‘పూరి కనెక్ట్స్’ సంస్థను స్థాపించాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టు బాలకృష్ణ ‘పైసా వసూల్’కు భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మాత అయినా… నిర్మాణంలో ‘పూరి కనెక్ట్స్’ను ఇన్వాల్వ్ చేశాడు పూరి. కుమారుడు ఆకాష్ పూరితో తీస్తున్న సొంత సినిమా ‘మెహబూబా’ వ్యవహారాలు కూడా చార్మీ చూసుకుంటోంది. భవిష్యత్తులో పూరి సినిమాలు అన్నిటిలో చార్మీ జోక్యం తప్పదేమో!!