ఏప్రిల్ మంత్ ఎండ్ రిలీజ్ డేట్ కోసం మహేష్ బాబు, రజనీకాంత్, అల్లు అర్జున్ సినిమాల మధ్య ఫైట్ జరుగుతోంది. ప్రేక్షకుల్లో ఎవరు వెనక్కి వెళతారు? ఎవరు ముందుకు వస్తారు? ప్రశ్నలకు బదులు హీరోలకు అంత ఈగో ఎందుకు? అనేవరకూ వచ్చింది. ఈ గొడవ జరుగుతుండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ను మే11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. పేరుకి అభిషేక్ నామా ఈ సినిమా నిర్మాత అయినా తెర వెనుక చక్రం తిప్పుతున్నది మాత్రం హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ అని ఇండస్ట్రీ టాక్. చాలా తెలివిగా ఆయన కుమారుడి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
మహేష్, బన్నీలలో ఎవరో ఒకరు ఓ వారం ముందుకు వెళ్లినా? వెనక్కి వచ్చినా? ‘సాక్ష్యం’కి వచ్చే నష్టం ఏం లేదు. ఏప్రిల్ 26కి రెండు వారాల తర్వాత ‘సాక్ష్యం’ వస్తుంది కాబట్టి. ఒకవేళ ఎవరో ఒకరు రెండు వారాలు వెనక్కి వచ్చినా బెల్లకొండ సాయిశ్రీనివాస్ మార్కెట్ కి తగ్గ థియేటర్లు దొరుకుతాయి. సినిమా టాక్‌ను బట్టి రిజల్ట్ వుంటుంది. గతేడాది ఆగస్టులో నితిన్ ‘లై’, రానా ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమాలతో వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో ‘సాక్ష్యం’ విడుదలకు రెడీ అవుతున్నారట!