మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్లాప్ సినిమాల్లో ‘విన్నర్’ది స్పెషల్ ప్లేస్! గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు క్రేజీ స్టార్స్, టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. విజయాల్లో వున్న రకుల్‌కి, సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్న జగపతిబాబుకి ఈ సినిమా ప్లాప్ అందించింది. నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అటువంటి ప్లాప్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనిపై మెగా మేనల్లుడు మళ్ళీ నమ్మకం పెట్టుకున్నాడు. అఫ్ కోర్స్… ‘విన్నర్’ తర్వాత తేజ్ చేసిన సినిమాలు కూడా ఫ్లాపులే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.