కోన వెంకట్ క్యాంపులో కొన్ని సినిమాలతో పాటు పూలరంగడు, అహనా పెళ్లంట, భీమవరం బుల్లోడు తదితర చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘బృందావనమది అందరిది’. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్, ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంతలో ఏమైందో ఏమో… ఈ సినిమా నుంచి సీరత్ తప్పుకుంది. ఆమె స్థానంలోకి అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’, సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాల్లో నటించిన హీరోయిన్ రిచా పనయ్ను సెలెక్ట్ చేసినట్టు టాక్. ప్రస్తుతం సీరత్ చేతిలో సినిమాలు ఏవీ లేవు. ఇటీవల రవితేజ సరసన సెకండ్ హీరోయిన్గా నటించేంచిన ‘టచ్ చేసి చూడు’ విడుదలైంది. అది ప్లాప్ కావడంతో ఆమెకు మైనస్ అయ్యింది. ఇటువంటి టైమ్‌లో సీరత్ ఎందుకు తప్పుకుందో? సినిమా టీమ్‌తో ఆమెకు ఏవో గొడవలు వచ్చాయని ఫిల్మ్ నగర్ పుకారు!