రెజీనా బాలీవుడ్ ఆశలు ఇంకా చావలేదు! ఆల్మోస్ట్ సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో రెజీనా ఛాప్టర్ ఎండింగ్ స్టేజ్‌కి వచ్చింది. కెరీర్ కొత్తల్లో ఈ అమ్మాయి స్టార్ హీరోల సరసన నటించే రోజు త్వరలో వస్తుందని అనుకున్న వాళ్ళు రెజీనా గ్రాఫ్ చూసి… ఇక, అమ్మాయికి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు. సినిమాల ఎంపికలో చేసిన కొన్ని తప్పులు రెజీనాను స్టార్ హీరోయిన్ రేసులో నుంచి కొంత కిందకు లాగితే… దురదృష్టం ఇంకొంత కిందకు లాగింది. మధ్యలో బాలీవుడ్ మోజులో ఇక్కడ సినిమాలు కొన్నిటిని వదులుకోవడం రెజీనా చేసిన పెద్ద తప్పు.
రెండేళ్ల క్రితం రెజీనాకు హిందీలో ‘ఆంఖేన్2’లో నటించే ఆఫర్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్షి వంటి స్టార్స్ సినిమా కావడంతో రెజీనా వెంటనే ఓకే చెప్పింది. ముంబైలో జరిగిన ఓపెనింగ్ ప్రోగ్రాంలో బికినీ వేసుకుని అందాలు ఆరబోసింది. కట్ చేస్తే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా మధ్యలో ఆగింది. అప్పట్లో ఆ సినిమా కోసం రెజీనా కొన్ని సౌతిండియన్ సినిమాలు వదులుకుంది. ఇప్పుడు ‘అ!’ సినిమాతో రెజీనాకు తెలుగులో మంచి పేరు వస్తున్న తరుణంలో మళ్ళీ బాలీవుడ్ అంటోంది. హిందీలో రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా రూపొందనున్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో హైసీ లాగా’లో రెజీనాకు ఒక రోల్ ఆఫర్ చేశారని, ఆమె ఓకే చెప్పిందని టాక్. ఈ సినిమా ఆడిషన్స్ కు వెళ్లొచ్చిన తర్వాత రెజీనానే తెలిసిన మీడియా జనాలకు లీకులు ఇచ్చింది. ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా సహా నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు అతని సిస్టర్ షెల్లీ చోప్రా ధార్ దర్శకురాలు. తెలుగులో కెరీర్ మళ్ళీ గాడిన పడుతున్న సమయంలో బాలీవుడ్ అంటూ మళ్ళీ రెజీనా తప్పటడుగు వేస్తుందా? వెయిట్ అండ్ సీ!