నాని కోసం క్యూ కట్టే దర్శకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కృష్ఱార్జునయుద్దం సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఆ తరవాత నాగార్జునతో మల్టీస్టారర్ మొదలవుతుంది. ఈలోగా విక్రమ్ కె.కుమార్ కథకి ఓకేచెప్పాడు. మరోవైపు కిషోర్ తిరుమల తోనూ జట్టు కట్టడానికి రెడీ అయ్యాడు. అయితే.. ఇప్పుడు నానికి ఓ స్వీట్ కన్ఫ్యూజన్ మొదలైంది. నాగ్‌తో మల్టీస్టారర్ తరవాత ఎవరి సినిమాని పట్టాలెక్కించాలా?? అని ఆలోచిస్తున్నాడు. నిజానికి కిషోర్ తిరుమల సినిమానే ముందు సెట్స్‌పైకి వెళ్తుందనుకున్నారు. అయితే నాని మాత్రం.. సందిగ్థంలో పడ్డాడట. కిషోర్ తిరుమల కంటే ముందుగా విక్రమ్ కె.కుమార్ సినిమాకే కాల్షీట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు టాక్. సాధారణంగా స్క్రిప్టు విషయంలో చాలా టైమ్ తీసకుంటాడు విక్రమ్ కె.కుమార్. అయినా సరే.. విక్రమ్ కోసం కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా ఫర్వాలేదన్న నిర్ణయానికి వచ్చాడట. నాగ్‌తో సినిమా జరుగుతుండగానే…. విక్రమ్ సినిమా మొదలెట్టాలన్నది నాని ప్లాన్. ఒకవేళ విక్రమ్ స్క్రిప్టు కోసం సమయం తీసుకున్నా.. ఒకటి, రెండు నెలలు ఎదురుచూడడానికి కూడా రెడీ అంటున్నాడు నాని. సో…. కిషోర్ తిరుమల సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతుందన్నమాట.