సుకుమార్లాంటి మిస్టర్ పర్ఫెక్షనిస్టులతో కాస్త కష్టమే. ఓ పట్టాన ఏదీ నచ్చదు. ‘వన్ మోర్’…. అంటూ.. పొడిగిస్తూ ఉంటారు. ‘రంగస్థలం’కి అదే సమస్య. తాను తీసిన సీన్లనే మళ్లీ రీషూట్లు చేసుకుంటూ కూర్చుంటున్నాడు సుకుమార్. దానికి తోడు చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ కూడా తోడైంది. దాంతో ఈ రీపేర్లు ఇంకాస్త గట్టిగానే జరుగుతున్నాయి. షూటింగ్ అయిపోయిందనుకుంటున్న దశలో సుకుమార్లో పర్ఫెక్షనిస్టు మళ్లీ నిద్రలేచాడు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు రిపేర్లు మొదలెట్టాడు. హైదరాబాద్లో ప్రస్తుతం రంగస్థలం రీషూట్లు సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు తీసిన సన్నివేశాలకే మళ్లీ మెరుగులు దిద్దబోతున్నాడు సుక్కు. ఇటీవల విడుదల చేసిన తొలి పాటకు మంచి స్పందన వస్తోంది. ఆ పాటతో ఈ సినిమాపై నమ్మకం ఇంకాస్త పెరిగింది. ఆ అంచనాల్ని అందుకోవాలంటే ఈ స్థాయిలో కష్టపడాల్సిందేనేమో.