బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎంత భారీగా ఉంటాయో… మెగా ఫ్యామిలీపై, రామ్‌చరణ్‌పై మాస్ జనాల్లో అభిమానం ఎంత భారీగా ఉంటుందో… అంత భారీ డీల్ కుదిరింది. దీంతో తెలుగు సినిమాలో ఒక కొత్త రికార్డు నమోదైంది. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా హిందీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వసూళ్లకు కంచుకోట నైజామ్ ఏరియాలో స్టార్ హీరోల సినిమాల థియేట్రికల్ రైట్స్ ఒక్కోసారి ఎంత రేటు పెట్టి కొంటారో.. రామ్‌చరణ్ – బోయపాటి శ్రీను సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు అంత అమౌంట్ వచ్చింది. 22 కోట్ల రేటు పెట్టి గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ ఈ రైట్స్ కొనుక్కుందని సమాచారమ్. ఒక తెలుగు సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంత పెద్ద అమౌంట్ రావడం ఇదే తొలిసారి. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌కి టీవీల్లో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దీనికి తోడు హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే చరణ్ ఒక హిందీ సినిమా చేశాడు. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దాంతో ఎక్కువ అమౌంట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో చరణ్ ఎంటర్ అవుతాడు. ఆల్రెడీ వివేక్ ఎంటర్ అయ్యాడు. అతడిపై సీన్లు తీస్తున్నారు.