రాజ్ తరుణ్ – హెబ్బా పటేల్‌ని కలిపిన సినిమా… కుమారి 21 ఎఫ్. దాంతోనే వాళ్లు హిట్ పెయిర్ అయ్యారు. ఈచిత్రానికి సూర్య ప్రతాప్ దర్శకుడు. ఈ కాంబోలో మరో సినిమాకి ముహూర్తం కుదిరింది. అయితే… ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్‌ని తప్పించారని, తన స్థానంలో వరుణ్‌తేజ్‌ని తీసుకున్నారని.. ప్రచారం జరుగుతోంది. ఫిదా, తొలి ప్రేమ హిట్టులతో ఫామ్‌లోకి వచ్చిన వరుణ్ తేజ్ అయితే మార్కెట్ పరంగా బాగుంటుందని, రాజ్ తరుణ్ కంటే.. వరుణ్‌కే యూత్‌లో ఎక్కువ క్రేజ్ ఉందని నిర్మాతలు భావిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. రాజ్ తరుణ్‌తోనే ఈసినిమా పట్టాలెక్కిస్తున్నారు. హీరో స్థానంలోనే కాదు, ఎక్కడా ఎలాంటి మార్పులూ లేవు. ఈ విషయంపై నిర్మాతలు స్పందింని ఈ రోజు, రేపటిలోగా ఓ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. మరి ఈ ఫాల్స్ న్యూస్ ఎలా పుట్టిందో? ఎవరు పుట్టించారో??