వంశీ సినిమా ‘అనుమానాస్పదం’తో ఎంట్రీ ఇచ్చింది పొడవు కాళ్ల సుందరి.. హంసా నందిని. ఆ తరవాత నుంచీ అమెది గెస్ట్ ఎంట్రీనే. అప్పుడప్పుడూ అతిథిగా వచ్చి, ఇలా మెరిసి, అలా వెళ్లిపోతుంది. అత్తారింటికి దారేది, జై లవకుశల్లో అతిథి టైపు పాత్రలే చేసింది. ఇప్పుడు మరోసారి ఆమెకు అలాంటి ఆఫరే అందింది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. కె.చక్రవర్తి దర్శకుడు. ఇందులో హంసానందినికి ఓ పాత్ర దక్కింది. అయితే ఇదేం వ్యాంపు తరహా పాత్ర కాదట. తన స్థానానికీ ప్రాధాన్యం ఉంటుందని చెబుతోంది హంసా నందిని. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి స్ననాహాలు చేస్తున్నారు. ఎన్ని సినిమాల్లో నటించినా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించలేని హంసా నందిని ఈసారైనా… నెగ్గుకొస్తుందేమో చూడాలి.