పెళ్ళెప్పుడు? అనడిగితే సరైనోడు దొరికినప్పుడు అని కలువకళ్ళ చందమామ తడుముకోకుండా ఠక్కున సమాధానం చెబుతుంది. నిద్రలో లేపి అడిగినా సేమ్ ఆన్సర్ ఇస్తుంది. హీరోయిన్ గా కాజల్ కెరీర్ క్లోజ్ అయ్యిందన్న ప్రతిసారీ కొత్త సినిమా ఛాన్సులు వస్తున్నాయ్. అలాంటప్పుడు కాజల్ ఎందుకు పెళ్ళి చేసుకుంటుంది? కానీ, హీరోయిన్ రేసులో అక్కతో పోటీ పడడం కాదు, కనీసం కనుచూపు మేరల్లో కూడా చోటు దక్కించుకోలేకపోయిన చెల్లెలు నిషా అగర్వాల్ ఐదేళ్ల క్రితం 2003లో పెళ్ళి చేసుకుంది. బుధవారం పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. పెళ్లి పీటలు ఎక్కడానికి బోల్డంత సమయం ఉందని చెప్పే కాజల్ పెళ్ళికి ముందు అమ్మ అయ్యింది. చెల్లెలు అమ్మ కావడంతో పెద్దమ్మ అయ్యింది. ఈ బిడ్డకు ‘ఇషాన్’ అని పేరు పెట్టారు. “రాత్రి అంతా నిద్ర లేకుండా మేల్కోవాల్సి వచ్చింది. మా ఇషాన్‌ను చూశారా” అని ముద్దు పెడుతున్న ఫొటోని కాజల్ ట్వీట్ చేశారు. బుధవారం బుడ్డోడి దగ్గర ఉన్న కాజల్ గురువారం షెడ్యూల్ ప్రకారం పబ్లిసిటీ ఈవెంట్స్ కి అటెండ్ అయ్యింది. ఫ్యామిలీ ఫ్యామిలీయే కాజల్ ప్రొఫెషనలిజం ప్రొఫెషనలిజమే!
The force awakens (at all hours of the night). Meet our new little jedi *Ishaan Valecha* ? @AggNisha @_karanvalecha_ so much love ❤️ pic.twitter.com/5uDvoIdQUh
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 21, 2018