ఓటు కు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల లో సంచలనం సృష్టించిన కేసు ఓటుకు నోటు.ఒక్క ఎమ్మెల్సీ సీటు విషయం లో అభ్యర్థి ని డబ్బుతో కొనడానికి ప్రయత్నించి రేవంత్ రెడ్డి వీడియో ఆధారాలతో దొరకడం తో చంద్ర బాబు ఆ నాడు ఇరకాటం లో పడ్డారు. అయితే ఆ తర్వాత కేసు నెమ్మదిగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది. అయితే హఠాత్తుగా ఈ కేసులో ఈరోజు చలనం రావడం విస్తుగొలుపుతోంది.
ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న జెరుసలెం మత్తయ్య తాను అప్రూవర్ గా మారుతున్నట్టు ఏకంగా సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ కి ఇవాళ లేఖ వ్రాసారు. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసి తాను అప్రూవర్ గా మారడానికి అవకాశమివ్వాల్సిందిగా కోరారు. ఈ ఇష్యూలో తనను అన్యాయంగా ఇరికింఇచారని, తనకి ఎటువంటి సంబంధమూ ఈ కేసు తో లేదనీ, రాజకీయ చదరంగం లో తనని పావు చేసారని గతం లో మత్తయ్య వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఈ కేసులో మొత్తానికి ఎన్నికల ఏడాదిన చలనం రావడాం పలు అనుమానాలకి తావిస్తోంది. అందులోనూ బిజెపి టిడిపి మధ్య మాటల మంటలు రేగుతున్న సమయం లో ఈ కేసు మలుపు తిరగడం సంచలనం సృష్టిస్తోంది.