శ్రీదేవి సినిమా కెరీర్లో ఎన్నో ఆశ్చర్యాలు.. ఇంకెవరికీ సాధ్యం కాని సంగతులు.. ఎన్టీఆర్‌తో మనవరాలిగా నటించి… ఆయనతోనే హీరోయిన్ అయ్యింది.. శ్రీదేవి. ఈ ఫీట్ చేసిన ఏకైక భారతీయ నటి ఆమె. అంతెందుకు..?? శ్రీదేవి తొలి తెలుగు హీరో… చంద్రమోహన్. చిననాటి శ్రీదేవిని ఆయన ఎత్తుకున్నారంటే, తన ఒడిలో నిద్రబుచ్చారంటే నమ్ముతారా? ఆమె ఎదిగి.. చంద్రమోహన్‌తో కలసి ‘పదహారేళ్ల వయసు’లో ఆడి పాడింది. ఆసినిమా సూపర్ డూపర్ హిట్. దీంతోనే శ్రీదేవి టాలీవుడ్లో తన ప్రభంజనానికి శ్రీకారం చుట్టింది. ‘యశోద కృష్ణ’లో చంద్రమోహన్, శ్రీదేవి కలసి నటించారు. అప్పటికి శ్రీదేవికి ఎనిమిదేళ్లు. షాట్ మధ్యలో చంద్రమోహన్‌తో కలసి శ్రీదేవి ఆడుకునేదట. ఓరోజు శ్రీదేవికి అర్జెంటుగా మద్రాస్ వెళ్లాల్సివచ్చింది. చంద్రమోహన్ కూడా మద్రాసు వాసే. అందుకే… తన కార్లో కూర్చోబెట్టుకుని శ్రీదేవిని చెన్నై తీసుకెళ్లాడు. దార్లో చంద్రమోహన్ ఒడిలో పడుకుని నిద్రపోయిందట శ్రీదేవి. అలా తన ఒళ్లో పడుకున్న చిట్టి పాపాయి.. ఆ తరవాత తనతో పాటు కలసి ఆడిపాడుతుందని చంద్రమోహన్ అనుకోలేదు. ఈ విషయాన్ని చంద్రమోహనే.. గుర్తు చేసుకున్నారు.