మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా అశ్వనిదత్ తన స్వంత బ్యానర్ వైజయంతి పతాకంపై ” మహానటి” సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీదేవి కి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు అశ్వనిదత్ .
గతంలో ఇదే వైజయంతి పతాకం పై చిరంజీవి, శ్రీదేవి జంటగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని నిర్మించారు అశ్వనిదత్. అప్పట్లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. శ్రీదేవికి అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ఒక ఎత్తైతే ఈ సినిమాతో వచ్చిన దేవకన్య ఇమేజ్ మరొక ఎత్తు. ఆ సినిమా అప్సర పేరుతో హిందీలోనూ విడుదలైంది. అక్కడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అశ్వినీ దత్ కెరీర్లోనే ఈ సినిమా ఒక మైలురాయిగా మిగిలిపోయింది . దీంతో శ్రీదేవి అంటే ఎంతో అభిమానం ఉన్న అశ్వనిదత్ తాజాగా నిర్మిస్తున్న “మహా నటి” మూవీని శ్రీదేవికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. అశ్వనిదత్ అల్లుడు నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సావిత్రిగా కీర్తీ సురేష్ నటిస్తున్నది. దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు తదితర నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఒక నటి జీవిత చరిత్ర పై సినిమా ని మరొక నటికి అంకితమివ్వడం కొత్త పరిణామం.