రాంగోపాల్ వర్మ – నాగార్జున కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని, టైటిల్ ఏంటో ప్రకటిస్తారని చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం ఓ ప్రకటన కూడా చేసింది. అయితే శ్రీదేవి హఠాన్మరణంతో టైటిల్, ఫస్ట్ లుక్ బయటకు రాలేదు. అయితే.. ఈ చిత్రానికి ‘ఆపీసర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో నాగ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. అందుకే… ఆ పేరు సెట్ చేసినట్టు తెలుస్తోంది. ‘గన్’, ‘డిపార్ట్మెంట్’ అనే పేర్లు కూడా పరిశీలించారు. చివరికి ‘ఆఫీసర్’ సెట్టయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈవారంలోనే ఫస్ట్లుక్తోపాటు టైటిల్ని బయటకు విడుదల చేస్తారు.