మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా తని ఒరువన్ రీమేక్ ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించబడుతున్న ఈ సినిమాలో మొన్నటిదాకా కథానాయికలుగా సమంత, శృతి హాసన్, దిశా పటని పేర్లు వినపడ్డాయి. కాని వీరిలో ఎవరు ఫైనల్ కాలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల సినిమాలో హీరోయిన్ గా ఓ మలయాళ భామను ఫోటో షూట్ చేశారట.
తెలుగులో మలయాళ భామలకు సూపర్ క్రేజ్ ఉంది. మలయాళ ముద్దుగుమ్మలంటే తెలుగు ప్రేక్షకులకు మహా ఇష్టం. అయితే లాస్ట్ ఇయర్ ప్రేమమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే తెలుగులో త్రివిక్రం అ..ఆ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అమ్మడి అభినయానికి చిత్ర యూనిట్ అంతా ప్రశంసల వర్షం కురిపిస్తుందట. అయితే ఇప్పుడు చరణ్ సినిమాలో హీరోయిన్ గా ఆమెతో చర్చలు జరుపుతున్నారట చిత్ర యూనిట్. అంతేకాదు ఆమెతో ఓ సీక్రెట్ ఫోటో షూట్ కూడా చేశారని తెలుస్తుంది.
ఒకవేళ ఇదే కనుక నిజమే అయితే అనుపమ స్టార్ హీరోయిన్ అయ్యిపోయినట్టే. ఇప్పటికే అ..ఆ కాకుండా మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో కూడా అనుపమ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. మరి చూస్తుంటే అమ్మడు అతి తక్కువ టైంలోనే ఎక్కడికో వెళ్లిపోతుంది అనిపిస్తుంది.