అందాల తార, మహానటి శ్రీదేవి మన మధ్యలో లేదు. దేవకన్యగా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న శ్రీదేవి..నిజంగానే ఓ దేవనక్యలా అకస్మాత్తుగా దేశం కాని దేశంలో ఎవరికీ కనిపించకుండా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె మృతిపై ఎన్నో సందేహాలు, అనుమానాలు. భర్త బోనీ కపూర్ ని ‘దేశం వదిలివెళ్లొద్దు’ అంటూ దుబాయ్ అధికారుల ఆంక్షలు. అసలు ఆ మహానటి అంత తేలిగ్గా ఎలా వెళ్ళిపోతుందని అభిమానుల ఆవేదన. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు శ్రీదేవి కాపురం, బోని కపూర్ పై అందరి ద్రుష్టి పడింది.
శ్రీదేవి, బోని కపూర్ లది రెండు దశాబ్దాల దాంపత్యజీవితం. అయితే అదేమీ అంత సజావుగా సాగలేదు. శ్రీదేవి… బోనికి రెండో భార్య. శ్రీదేవితో పెళ్లికి ముందే బోనికి మోనా కపూర్ తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. అర్జున్, అన్షు కపూర్. శ్రీదేవి, బోనిల వ్యవహారం గురించి తొలిసారి తెలుసుకున్న బోని భార్య మోనా ఒక్కింత షాక్ కి గురైయింది. ”బోని నాకంటే పదేళ్ళు పెద్ద. నాకు 19ఏళ్ళు వున్నప్పుడు బోనితో వివాహం జరిగింది. నేను అతని దగ్గర పెరిగాను. నా భర్త వేరే స్త్రీ ప్రేమలో ఉన్నాడని తెలిసి షాక్ అయ్యాను. శ్రీదేవి నా ఇల్లు కూల్చడానికి వచ్చిందని అనుకునే దాన్ని. కాని అప్పటికే నా చేతిలో ఏమీ లేదు. బోని కారణంగా అమెకు ఒక బిడ్డ ఉన్నాడని కూడా తెలిసింది. ఇంక నేను చేసేది ఏమీ లేదు. వాళ్ళు గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ లీగల్ గా నేనే భార్యని. దీంతో శ్రీదేవిలో చాలా ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్ వుండేది’ అని ఓ ఇంటర్వ్యూలో తన మనోగతం బయటపెట్టింది మోనా.
శ్రీదేవి బోనిల వివాహం జరిగిన కొన్నాళ్ళుకు మెల్లమెల్లగా మళ్ళీ కలహాలు మొదలయ్యాయి. బోనీ కపూర్, మొదటి భార్య దగ్గర ఉండటానికే ఎక్కువ ఇష్టం చూపేవాడట. అర్జున్, అన్షులతో ఎక్కువ సమయం గడపటం, వాళ్ళను టూర్స్ కి పిక్నిక్ లకు తీసుకువెళ్ళడం చేసేవాడట. దీంతో సహజంగానే శ్రీదేవిలో ఒక్కింత అసహనం వచ్చింది. అయితే ఇది మోనా పై గానీ అర్జున్, అన్షుల పై గానీ కాదు. ”అసలు భార్య పిల్లలు అంటే ఇంత ప్రేమ, ఇష్టం వున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్. నీ బుద్ధి ఏమైయింది. నన్ను ఇలాంటి పరిస్థితిలో ఎందుకు నెట్టావ్. యూ చీటర్” అని శ్రీదేవి బోనికి చీవాట్లు పెట్టేదని ఇరుగు పోరుగు చెప్పినట్లు ఒక వార్త ప్రచురితంలో వుంది.
దీంతో బోనీ మరో నిర్ణయం తీసుకున్నాడు. మోనాను పిల్లల్ని వదిలేశాడు. ఇంక తనతో ఎలాంటి బంధం వుండదని చెప్పేశాడట. ఆ బెంగతోనే మోనా మంచం పట్టింది. అయితే ఇదే సమయంలో మోనా తల్లి సత్తే శౌరీ రంగంలో దిగింది. తన కూతురు కాపురం ముక్కలు చేసిన శ్రీదేవికి శాపనార్ధాలు పెట్టింది. అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి గొడవ కూడా పడేది. కొన్ని సార్లు శ్రీదేవిపై చేయికూడా చేసుకునేదని ఇరుగుపొరు చెప్పినట్లు ఓ కధనం వుంది.
అయితే బోనీ ఈసారి శ్రీదేవి పక్కన నిలబడ్డాడు. ఇంక మోనా బాధ్యతలు వదిలేశాడు. అలా మొదటి భార్యతో సంబధాలు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్ శ్రీదేవిపై ద్వేషం కూడా పెంచుకున్నాడని చెబుతారు. అయితే మోనా, అర్జున్ ని బుజ్జగించేది. ”జీవితంలో ఎవరిపై కూడా ద్వేషం వద్దు అని చెప్పేదట. అసలు వాళ్ళు వున్నారనే సంగతే మరిచిపో. నీకు నేను తప్పా ఎవరు లేరు’అని చెప్పేదట. అర్జున్ కూడా ఇదే ఫాలోయ్యాడు. శ్రీదేవి బిడ్డలైన జాన్వీ ఖుసిలతో అర్జున్ కి ఇప్పటికీ ఎలాంటి అనుబంధం వుండదు. ”శ్రీదేవి కేవలం మానాన్న భార్య. అంతకుమించి వారితో నాకు ఎలాంటి సంబధం లేదు’అని అర్జున్ ఇటివలే ఓ ఇంటర్ వ్యూలో చెప్పడం కూడా తెలిసేవుటుంది.
మొత్తంమ్మీద రెండో భార్యగా వెళ్ళిన శ్రీదేవి.. సినిమాలో చూపించినట్లు ఎన్ని బాధలు, ఎంత క్షోభ అనుభవించాలో అంతా అనుభవించింది. పెళ్లి ముందు అసలు భార్యతో తనకు సుఖం లేదని, ఆ బంధం ఒక నరకంలా వుందని చెప్పేవాడట బోనీ. అయితే పెళ్లి తర్వాత సీన్ మాత్రం మరోలా కనిపించింది. ఒక దశలో బోనీ తనను చీట్ చేసాడని కూడా భావించిందట శ్రీదేవి. ఐతే ఇదంతా తన తలరాత అని భావించి, ఇంక పిల్లల భవిష్యత్ కోసమే బ్రతికిన అతిలోక సుందరి.. ఇప్పుడు తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయింది.