శ్రీదేవి మరణం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే… శ్రీదేవి మరణంపై రకరకాల పుకార్లు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది హత్యే.. అని తేల్చేశారాయన. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని, ఎవరో బలవంతంగా మద్యం తాగించారని, ఆ రాత్రి శ్రీదేవి హోటెల్‌కి ఎవరెవరు వెళ్లారో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ హోటెల్ తాలుకూ… సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పటి వరకూ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. బాలీవుడ్‌కీ ముంబై మాఫియాకీ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారాయన. శ్రీదేవి మరణంపై ఎవరేం మాట్లాడినా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది నోటికొచ్చిన వ్యాఖ్యాలు చేస్తున్నారు. మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ బాపతేనా? లేదంటే… ఈ వ్యాఖ్యాల్ని సీరియెస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందా?? అంటూ శ్రీదేవి అభిమానులు కాస్త గందరగోళానికి లోనవుతున్నారు. దుబాయ్ పోలీసులు.. ఈ కేసుని ఎంత త్వరగా తేల్చేస్తే అంతమంచిది. లేదంటే… ఇలాంటి వ్యాఖ్యలు నిమిషానికి ఒకటి చొప్పున వినాల్సివస్తుంది.