పట్టు వదలని విక్రమార్కుల తరహాలో ప్రతి టీవీ ఛానల్, పేపర్ శ్రీదేవి గోలలో పడి మిగతా వార్తలను పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ ఈ రెండు రోజుల్లో చాలా విషయాలు జరిగాయి. అందులో తమిళ నటుడు మాధవన్ షోల్డర్ సర్జరీ ఒకటి. సఖి, యువ, రన్ వంటి సినిమాలతో ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసినోడే. ప్రజెంట్ నాగచైతన్య ‘సవ్యసాచి’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. “నాకు షోల్డర్ సర్జరీ జరిగింది. రైట్ ఆర్మ్ స్పర్శ తెలియడం లేదు” అని మాధవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ వార్తను చూసి చూడనట్టు వదిలేశారు. ఏదో రెండు మూడు ముక్కలు చెప్పి వదిలేశారు. లేదంటే షోల్డర్ సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు? ఒకవేళ ఎవరైనా చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షోల్డర్ సర్జరీ ఎలా చేస్తారు? వంటి అంశాల మీద డిబేట్స్, డిస్కషన్స్ కండక్ట్ చేసేవారేమో!? ఏ వార్తా లేనప్పుడు దొరికిన వార్తే మహాప్రసాదం మరి! తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులకు ఎక్ట్రా లడ్డూలు దొరికినట్టు శ్రీదేవి మరణంపై రోజుకో కొత్త వార్త రావడంతో మిగతావాటిని లైట్ తీసుకున్నారు.
మాధవన్ సర్జరీ విషయానికి వస్తే జింలో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు షోల్డర్ పెట్టేసిందట. ఆపరేషన్ చేసిన డాక్టర్స్ ఐదు నెలలు యాక్షన్ సీన్లు చేయకుండా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. మాధవన్ యాక్షన్ సీన్లు చేయాల్సిన సినిమా షూటింగులు పోస్ట్ పోన్ చేసుకోక తప్పదు!