సోషల్ మీడియా సినిమా తారలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ప్రశాంతంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోంది. రీసెంట్గా విశాల్ అమెరికా వెళ్ళాడు. ఆయనకు ఏదో జబ్బు చేసిందని, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటున్నాడని కథనాలు వచ్చాయి. వీటిపై విశాల్ స్పందించాడు. “నేను హాస్పిటల్లో చేరానని పుకార్లు షికారు చేస్తున్నాయి. నా స్నేహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా… ఐయామ్ ఫిట్. నా మైగ్రైన్ (తీవ్రమైన తలనొప్పి) సమస్యను పూర్తిగా నయం చేసుకోవడానికి వచ్చా. మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా వెనక్కి తిరిగి వచ్చేస్తా” అని విశాల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం విశాల్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ‘ఇరుంబు తిరై’ విడుదలకు సిద్ధమైంది. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. నిజానికి, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కాంపిటీషన్ ఎక్కువ వుండడంతో మానేశారు. ఇది కాకుండా తమిళంలో ‘సండైకోళి–2’ చేస్తున్నాడు. తెలుగులోనూ సూపర్ హిట్టయిన ‘పందెం కోడి’కి సీక్వెల్ అది.
Rumours making rounds that I am admitted in hospital.Wanted to let all my friends,fans and well wishers know that I am fit as a fiddle.The retreat I came for to take care of my migraine will get over in few days & I will be back in the grind by the Ist week of March. C U Soon, GB
— Vishal (@VishalKOfficial) February 27, 2018