నవతరం దర్శకుల పుణ్యం…. తెలుగులో కొత్త కథలు పుడుతున్నాయి. ప్రయోగాలు చేయడానికి హీరోలు సై అంటున్నారు. పాటల్లేవన్నా ఓకే.. మాటలు లేవన్నా ఓకే. హీరోకి చెవుడన్నా ఓకే… మూగోడన్నా ఓకే. టాలీవుడ్లో ప్రయోగాల పరంపర కొనసాగిస్తూ… ఇప్పుడు మరో సినిమా వస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఓసినిమా చేస్తున్నాడు. ఘాజీ ఓ సబ్ మెరైన్ కథ. సినిమాలో ఎక్కువ భాగం నీటిలో సాగింది. ఇప్పుడు అంతరిక్షంలో సినిమా చేస్తున్నాడు సంకల్ప్‌రెడ్డి. దాదాపుగా 70 శాతం సన్నివేశాలు అంతరిక్షంతో ముడిపడి ఉంటాయట. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్థానం ఉంది. వాళ్లెవరన్నది త్వరలో ప్రకటిస్తారు. అయితే.. ఇందులో ఒక్కంటంటే ఒక్క పాటా ఉండదు. కథానుసారం పాటలు అవసరం లేదని సంకల్ప్ తేచ్చి చెప్పాడట. ఘాజీలోనూ సంకల్ప్ పాటలు పెట్టలేదు. కేవలం కథని కథగా చూపించడం, దానికి అనవసరపు హంగులు అద్దకపోవడం హాలీవుడ్ స్టైల్. సంకల్ప్‌రెడ్డి కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాడన్నమాట.