సెలెబ్రేషన్ క్లబ్ లో ఉన్న శ్రీదేవి భౌతిక కాయాన్ని చూడటానికి భారత సినీపరిశ్రమ మొత్తం తరలి వస్తోంది. మధ్యాహ్నం 2 గంటలవరకు అక్కడ సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచి, 3:30 గంటలకి పవన్ హాన్స్ శ్మశానవాటిక లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలివస్తున్నారు. చిరంజీవి, ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్, సంజీవ్ కపూర్, సోనమ్ కపూర్, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, ఫరా ఖాన్, అను కపూర్, హేమమాలిని, ఇషా డియోల్, హర్షవర్ధన్ కపూర్, సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, అక్షయ్ ఖన్నా, రితేశ్ దేశ్‌ముఖ్, సుస్మితాసేన్ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ల నుంచి మరింతమంది ప్రముఖులు తర లి వస్తుండగా, అంత్యక్రియలకి హాజరయ్యేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు.