పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇటీవల ‘ఏ మంత్రం వేసావె’ పేరు గల సినిమా వెలుగులోకి వచ్చింది. మార్చ్ 9న థియేటర్లలోకి రాబోతోంది. ‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో… అవకాశాల కోసం ఫిలింనగర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టిన సమయంలో… అవకాశం రావడమే అదృష్టమని భావించి చేసిన సినిమా. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీ ఇన్నాళ్ళు ల్యాబ్‌లో వుంది. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ విజయాలతో విజయ్ మార్కెట్ పెరగడంతో నిర్మాతలు సినిమాను తవ్వి బయటకు తీశారు. పెట్టుబడిలో ఎంతోకొంత ఈజీగా వెనక్కి వస్తుందని. కాని ఈ సినిమాపై ఇప్పుడు విజయ్ దేవరకొండకు అసలు ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. ప్రజెంట్ విజయ్‌కి యూత్, కాలేజీ స్టూడెంట్స్ లో మంచి క్రేజ్ వుంది. ‘ఏ మంత్రం వేసావె’ విడుదలై ఎక్కడ తనకు చెడ్డ పేరు తీసుకుతుందోనని భయపడుతున్నాడట. వీలైనంత మేరకు ఈ సినిమా దర్శక నిర్మాతలతో దూరం మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో విజయ్ లుక్ చూసి ఎప్పటిదో పాత సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో వచ్చింది. ఎంతమంది సినిమా చూడడానికి థియేటర్లకు వెళతారో చూడాలి.