ఆటలో గెలుపోటములు సహజం. రెండిటి కంటే ముఖ్యంగా క్రీడా స్ఫూర్తితో మెలగడం ముఖ్యం. ఓడినవారు ప్రతిభావంతులు కాదని కాదు. కానీ, విజేతగా నిలిస్తే అదొక ఆనందం. హీరో సాయిధరమ్ అటువంటి ఆనందంలో వున్నారిప్పుడు. ఆయన ఎందులోనూ విజేతగా నిలవలేదు. అయన సహాయం చేసిన పారా అథ్లెట్ రంగుల నరేష్ యాదవ్ విజేతగా నిలిచాడు. అసలు వివరాల్లోకి వెళితే… భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల మధ్య జరిగే ముక్కోణపు సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు నరేష్ సెలెక్ట్ అయ్యాడు. బ్యాంకాక్‌లో టోర్నీ. అక్కడికి వెళ్ళడానికి, వెళ్ళిన తర్వాత వుండడానికి ఖర్చులు లక్ష రూపాయలు అవుతాయి. ఈ టోర్నీకి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎవరి ఖర్చులు వాళ్ళే భరించాలి. అంత స్థోమత లేని నరేష్ సహాయం చేసే దాతల కోసం ఎదురు చూశాడు. మీడియాలో అతని వార్త చూసిన సాయిధరమ్ తేజ్ వెంటనే స్పందించి సకాలంలో డబ్బులు అందజేశాడు. టోర్నీకి వెళ్ళిన నరేష్ టీం వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.