టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి తెలియని క్రికెట్ ప్రేమికులు వుండరు. హిందీ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమ, పెళ్ళి కారణంగా సినిమా ప్రేమికులకూ అతను తెలుసు. క్రికెట్ గ్రౌండ్లోనూ, బయటా కోహ్లీది అగ్రెస్సివ్ నేచర్. అటువంటి కోహ్లీ భయపడ్డాడు. అతను భయపడింది ఆటలోనూ కాదు… బయటా కాదు… వెండితెర మీద అర్ధాంగిని చూసి. కోహ్లీ శ్రీమతి అనుష్క నటించిన హిందీ సినిమా ‘పరి’. నిర్మాత కూడా ఆమె. ఈ రోజు (శుక్రవారం) విడుదలైంది. గురువారం రాత్రి శ్రీవారి కోసం అనుష్క స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. సినిమా బాగుందంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సిన్మాల్లో ఇదొకటి అన్నాడు. సినిమా చూస్తూ భయపడినా అనుష్కను చూస్తే గర్వంగా వుందన్నారు. ఇంట్లో చాలా అందంగా కనిపించే అనుష్క, ఇలా సినిమాలో శ్రీవారిని భయపెట్టింది అన్నమాట! కోహ్లీ కాంప్లిమెంట్స్ కోసమైనా సినిమా చూద్దామనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. థియేటర్ల బంద్ కారణం హైదరాబాద్లో సినిమా విడుదల కాలేదు.