తమిళంలో జ్యోతిక చేసిన క్యారెక్టర్ తెలుగులో అనుష్క చేస్తే ఎలా వుంటుంది? ‘నాచియార్’ రీమేక్, డబ్బింగ్ రైట్స్ కొన్న కోనేరు కల్పన ఆఫీసులో డిస్కషన్‌కి వచ్చింది. అందరూ బాగుంటుందని అనుకున్నారు. అనుష్క దగ్గరకు త్వరలో వెళ్ళి సినిమాను చూపించి, తెలుగులో మీరు చేస్తే బాగుంటుందని అడగాలనుకుంటున్నారు. ఇంకా అడగలేదు. ఈలోపు ఎవరో ఈ విషయాన్ని బయట చెప్పారు. మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో ఈ వార్తలను చూసి అనుష్క ఏమనుకుంటారో అని నిర్మాత ఆలోచిస్తున్నారు. అనుష్కకు తమిళ సినిమా నచ్చి, తెలుగులో చేయడానికి ఓకే చెప్తే సరే… లేదంటే డబ్బింగ్ వెర్షన్ తెలుగు థియేటర్లలోకి వచ్చే ఛాన్సులున్నాయి. అందుకని, అనుష్క కొత్త సినిమాకు సంతకం పెట్టిందని సంబరపడే ప్రేక్షకులు కాస్త ఆగండి. నిర్మాతలు ముందు అనుష్కను అడగాలి. అక్కడ ఎలాంటి సమాధానం వస్తుందో? ప్రజెంట్ అనుష్క హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.