ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల సినిమా ఏప్రిల్‌లో మొదలు కానుంది. ఏప్రిల్ నుంచి నిరవధికంగా షెడ్యూల్ జరగబోతోంది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలన్నది ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల ప్లాన్. నిర్మాతలూ దానికే ఫిక్స్ అయ్యారు. కాకపోతే.. త్రివిక్రమ్ గురించి తెలిసిన వాళ్లెవరైనా ఈ సినిమా దసరాకి వస్తుందంటే నమ్మడం లేదు. 5 నెలల్లో సినిమాని పూర్తి చేయడం ఈరోజుల్లో సులభమే. కాకపోతే… త్రివిక్రమ్ పద్ధతి వేరు. తను మిస్టర్ పర్ఫెక్షనిస్టు. ఒక్కో సీనూ చెక్కుతూనే ఉంటాడు. షూటింగ్ అంతా పూర్తయినా.. ఆర్, ఆర్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకుంటాడు. పోస్ట్ ప్రొడక్షన్‌కి టైమ్ తీసుకోవడం త్రివిక్రమ్‌కి అలవాటే. అందుకే… 5 నెలల్లో ఈ సినిమా పూర్తవ్వడం కష్టమే అని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్టు లాక్ చేసినా… మరో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తమన్‌కి త్రివిక్రమ్‌తో పనిచేయడం ఇదే తొలిసారి. ఇద్దరికీ ట్యూన్ కుదరడానికే టైమ్ పట్టేట్టు ఉంది. పైగా వచ్చేది వేసవి సీజన్. ఇండోర్ అయితే ఫర్వాలేదు. అవుడ్డోర్ అయితే.. ఎండలు ముదిరితే షూటింగులకు పేకప్ చెప్పాల్సిందే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే మాత్రం త్రివిక్రమ్ ఎంత స్పీడుగా చేసినా… దసరా టార్గెట్‌కి రీచ్ అవ్వడం కష్టం. కాకపోతే త్రివిక్రమ్ కాస్త పట్టుగా ఉన్న విషయం ఒకటి ఉంది. ఈ యేడాది అజ్ఞాతవాసితో ఓ ఫ్లాప్ ఇచ్చాడు. ఇదే యేడాది లెక్క సరిచేయాలన్నది తన ఉద్దేశం. దసరాకి కాకపోయినా.. ఆ తరవాతైనా ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నాడు. మొత్తానికి 2018లోనే ఎన్టీఆర్ సినిమా రాబోతోంది. అది మాత్రం ఖాయం. దసరాకా, కాదా అనేది త్రివిక్రమ్ చేతుల్లో ఉంది.