సావిత్రి జీవిత కథని ‘మహానటి’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి కథ అంటే.. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల పాత్రలు తప్పని సరి. ఈ పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారా… అనే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్, ఏఎఎన్నార్గా నాగచైతన్య నటిస్తే బాగుంటుందని అంతా భావించారు. చిత్రబృందం కూడా వాళ్లతో మంతనాలు జరిపింది. నాగచైతన్య తాతయ్య పాత్రని చేయడానికి ఒప్పుకున్నా… ఎన్టీఆర్ ససేమీరా అనడంతో ఈ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తరవాత నాని, శర్వానంద్‌లను అనుకున్నారు. ఎందుకో అదీ వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ పాత్రకు సూర్య అయితే బాగుంటుందని భావించారు. అయితే సూర్యతో జరిపిన సంప్రదింపులు ఓ కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు మహానటి షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లు లేకుండానే.
వాళ్లకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కించలేదు. దానికి కారణం. ఆయా నటుల్ని రీ ప్లేస్ చేయదగ్గ వాళ్లు లేకపోవడమే. అయితే చిత్రబృందం ఈ విషయంలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోబోతోందని టాక్. ‘యమదొంగ’తో రాజమౌళి ఎన్టీఆర్‌ని గ్రాఫిక్స్రూపంలో నేలకు దించినట్టు.. ఈ సినిమాలోనూ ఏఎన్నార్, ఎన్టీఆర్ పాత్రల్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారన్నమాట. వాళ్లు నటించిన పాత సినిమాలోని క్లిప్పింగులను యధావిధిగా, సందర్భానికి తగినట్టు వాడుకోవడానికి చిత్రబృందం రెడీ అయిపోయిందని టాక్. మరి ఈ విషయంలో స్పష్టమైన సమాచారం రావాలంటే.. చిత్రబృందంలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.