‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి’, ‘గజని’ శివ మణి వంటి సినిమాలతో తెలుగు, తమిళం, హిందీ..మలయాళం ఇలా నలుగు బాషల్లోను స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన హీరోయిన్ అసిన్ తోట్టంకల్ గత రెండేళ్ళుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. రెండేళ్ళుగా మైక్రోమాక్స్ మొబైల్స్ ఫౌండర్ అయిన రాహుల్ శర్మతో ప్రేమలో ఉన్న ఆమె నేడు వివాహబంధంతో కొత్త జీవితానికి తెరతీశారు. ఢిల్లీలోని ఓ చర్చిలో పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహించిన వేడుకలో అసిన్-రాహుల్ శర్మల జంట ఒక్కటయ్యారు.
అక్షయ్ కుమార్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమాలో హీరోయిన్గా నటించిన అసిన్, ఆ సమయంలోనే రాహుల్ శర్మను కలవడం, అభిరుచులు కలిసి ప్రేమలో పడిపోవడం జరిగింది. ఢిల్లీ లోనే ఇక ఈ సాయంత్రం హిందూ సాంప్రదాయ పద్ధతిలో దుసిట్ దేవరన రిసార్ట్స్ లో మరో ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సమాచారం. ఇక వివాహ బంధంతో నేడు కొత్త జీవితానికి తెరతీసిన అసిన్‌కు ఈ సందర్భంగా తెలుగు360 తరపున శుభాకాంక్షలు.