అడివి శేష్ హీరోగా, రాజశేఖర్-జీవితల తనయ శివాని హీరోయిన్గా తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. హిందీ హిట్ ‘టూ స్టేట్స్’కి తెలుగు రీమేక్ ఇది. వెంకట్ రెడ్డి దర్శకుడు. ఇందులో హీరోయిన్ శివానికి తల్లిగా నటించడానికి భాగ్యశ్రీ అంగీకరించారు. అంటే.. సినిమాలో హీరో అడివి శేష్‌కి అత్తగారి వరస పాత్ర అన్నమాట! తెలుగులోనూ ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ ‘ప్రేమ పావురాలు’ (హిందీలో ‘మైనే ప్యార్‌కియా’)తో భాగ్య శ్రీ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అప్పట్లో తెలుగు రెండు మూడు సినిమాలు చేశారు. ఇప్పుడీ ‘టూ స్టేట్స్’ రీమేక్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 5న హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు భాగ్యశ్రీ షూటింగులో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. అడివి శేష్, శివాని, భాగ్యశ్రీ కాంబినేషన్లో సీన్లు తీయడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత కలకత్తాలో, అమెరికాలో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.