రంగస్థలంలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్‌లో రవితేజకు కళ్లు లేవు. వీరిచ్చిన ధైర్యంతో ఏమో.. నారా రోహిత్ మరో అడుగు ముందుకు వేసి.. మూగవాడిగా నటిస్తున్నాడు. నారా రోహిత్ కథానాయకుడిగా మంజునాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. అట్లూరి నారాయణరావు నిర్మాత. ఈ చిత్రంలో రోహిత్ మూగవాడిగా నటించబోతున్నాడు. ముందు నుంచీ కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ వైవిధ్యమైన ప్రయాణం సాగిస్తున్న రోహిత్… ఈమధ్య కాస్త కమర్షియల్ కథలవైపు లుక్కేశాడు. అయితే అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ తనదైన దారిలో వచ్చేశాడు. ఓ కథానాయకుడు సినిమా మొత్తం మాటల్లేకుండా నటించడం.. తెలుగు చిత్రసీమలో ఇదే తొలిసారేమో. `శీను`లో వెంకీ కాసేపు `బే.. బే.. బే..` అంటూ మూగవాడిగా నటించాడు. అయితే పూర్తి తరహా ప్రయత్నం ఇదే అనుకోవాలి.