అఖిల్ మూడో సినిమా ఎప్పుడు? ఎవరితో? నిర్మాత ఎవరు? ఈ ప్రశ్నకలకు సమాధానం దొరికేసింది. ఉగాది సందర్భంగా అఖిల్ తన కొత్త సినిమా విశేషాల్ని అభిమానులతో పంచుకున్నాడు. తొలి ప్రేమతో తొలి అడుగులోనే హిట్టు కొట్టిన… వెంకీ అట్లూరితో అఖిల్ కమిట్ అయిపోయాడు. ఈచిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు అఖిల్. తన తొలి రెండూ చిత్రాలూ అఖిల్ ని బాగా నిరాశ పరిచాయి. వినాయక్, విక్రమ్ కె.కుమార్ లాంటి అనుభవజ్ఞుల్ని నమ్ముకున్నా వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి కొత్త దర్శకుడి కథని ఓకే చేశాడు. ముచ్చటగా చేస్తున్న ఈ మూడో ప్రయత్నమైనా అఖిల్‌కి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.