కల్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఎ’గా కనిపించబోతున్నాడు. విలన్‌తో పోటీ పడి… ఎం.ఎల్.ఏగా నిలిచి, గెలవడమే ఈ సినిమా కథ. అయితే నిజ జీవితంలోనూ కల్యాణ్‌రామ్‌ని ఎం.ఎల్.ఏగా చూడాలన్నది పోసాని కృష్ణమురళి ఉవాచ. ఈ సినిమాలో పోసాని కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో… కల్యాణ్ రామ్‌ని తెగ పొగిడేస్తూ పనిలో పనిగా ఎం.ఎల్.ఏ కావాలన్న తన మనసులో కాంక్ష బయట పెట్టేశారు. ‘తెలుగు దేశం పార్టీ మీది.. అందుకే మీరు ఎం.ఎల్.ఏ అవ్వాలి’ అంటూ స్సీచ్ ఇవ్వడం.. రాజకీయంగా కాస్త చర్చకు దారిచ్చే విషయమే. `తెలుగు దేశం పార్టీ మీది.. `అని కల్యాణ్ రామ్‌ని ఉద్దేశించి అనడంలో ఆంతర్యం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ మనవలుగా ఆ పార్టీలో ఉండే హక్కు కల్యాణ్ రామ్‌కే ఉందన్నదని పోసాని మాట.
”కల్యాణ్ రామ్ చాలా మంచివాడు. నిజాయతీ ఉన్న వ్యక్తి. ఎం.ఎల్.ఏ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అని అర్థం. నిజంగా కల్యాణ్ రామ్ అలాంటివాడే. తను నిజంగానూ ఎం.ఎల్.ఏ కావాలి. ఇలాంటి మంచి మనుషులు రాజకీయాల్లోకి రావాలి” అని వ్యాఖ్యానించారు పోసాని. ఆయన ఏం మాట్లాడినా అందులో లిటికేషనూ, లాజిక్కు ఉంటాయి కదా? మరి ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.