The song of bharat
ఈ వేసవి వినోదాలు అందివ్వడానికి సిద్ధమయ్యాడు.. భరత్ అనే నేను. ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పుడు తొలి పాట వచ్చేసింది. ‘దిస్ ఈజ్ మీ’ అంటూ భరత్ (మహేష్ బాబు) పాత్ర చిత్రణకు సంబంధించిన పాట ఇది. ఒక విధంగా భరత్ అనే నేను థీమ్ సాంగ్ ఇదే. దేవిశ్రీ ప్రసాద్ ట్యూనింగ్ సరికొత్తగా అనిపించింది. రామజోగయ్య శాస్త్రి.. కలం సున్నితమైన భావాల్ని చిన్న చిన్న పదాల్లో పలికించింది.
”భరత్ అనే నేను
హామీ ఇస్తున్నాను
బాధ్యుడ్నై ఉంటాను
ఆఫ్ ది పీపుల్
ఫర్ ద పీపుల్
బై ది పీపుల్
ప్రతినిధిగా” అంటూ సాగిన ఈ పాటలో
”మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికి”
”అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ”
అనే పదాలు ఆకట్టుకున్నాయి. పాలకుడు ఎలా ఉండాలి? అనే దానికి ఈ పాట ఓ నిర్వచనం ఇచ్చిందనుకోవాలి. ఒక్కసారి వింటే ఇది దేవి పాట అని ఇట్టే చెప్పేయొచ్చు. కానీ ఈ పాట అలాంటి అవకాశం ఇవ్వలేదు. సౌండింగ్, మ్యూజిక్ ఇనిస్ట్రుమెంటేషన్, గాత్రం ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ‘భరత్ అనే నేను’ ఆల్బమ్‌కి పర్ఫెక్ట్ బిగినింగ్ ఇది. మిగిలిన పాటలెలాఉంటాయో చూడాలి.