అల్లు అర్జున్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా వచ్చే ఛాన్స్ వుందని ఈ రోజు ఒక వార్త బయటకు వచ్చింది. సి. కళ్యాణ్ ఈ కాంబినేషన్‌ను కలపడానికి ప్రయత్నిస్తున్నారని సదరు వార్త సారాంశమ్. దీనిపై దర్శకుడు టెన్షన్ పడుతున్నారని సమాచారమ్. సినిమా డిస్కషన్ స్టేజిలోనే వుంది, ఏదీ కన్ఫర్మ్ కాలేదు… ఈలోపు వార్త ఎలా బయటకు వచ్చిందని ఆలోచిస్తున్నారట. అల్లు అర్జున్‌తో సినిమా అంటే ఓ పట్టాన ఓకే కాదు. బోలెడు తతంగం వుంటుంది. నిర్మాత ఎవరైనా కథ మీద మెగా ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆమోదముద్ర తప్పనిసరి. ఇవన్నీ దాటుకుని సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి. ఈలోపు వార్త బయటకు రావడంతో సంపత్ సినిమా గురించి మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎవరు ఏమి అడిగినా సినిమా గురించి మాట్లాడడానికి చాలా టైమ్ పడుతుందని చెబుతున్నారట. రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘రచ్చ’కు దర్శకుడు ఈయనే. తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం ఒక కథపై రెండేళ్లు వర్క్ చేసి, సినిమా నుంచి బయటకు వచ్చాడు. దాంతో సంపత్ నంది ఆచితూచి మాట్లాడుతున్నారు.